Explore India onefivenine
       Peddakondur
          Telangana >> Nalgonda >> Choutuppal

Edit OverView Of Peddakondur

OverView Of Peddakondur


పెద్దకొ౦డూరు, ఒకప్పుడు  చిన్నకొ౦డూరు మేజర్ గ్రామ పంచాయితి పరిదిలోనిది. చిన్నకొ౦డూరు ఒకప్పుడు ఒక నియోజక వర్గము ఇక్కడి నుండి మూడు పర్యాయాలు M.L.A లు ఎన్నుకోబడినారు. తర్వాత  కొంత  కాలానికి ఇది ఒక  గ్రామపంచయితిగా ఏర్పడింది. దీనికి మొదటి సర్పంచి గా  పెద్దకొండుర్  గ్రామానికి చెందిన గూరూడురు మల్లా  రెడ్డి తర్వాత  బద్దం బక్కారెడ్డి (పెద్దకొండురు ), తర్వాత కరిపే రాములు (పెద్దకొండురు). అప్పుడు దీని  కింద 7 గూడేలు ఉండేవి. ఆ తర్వాత  పెద్దకొండురు ఒక గ్రామపంచయితిగా అయినది.    

పెద్దకొండూర్ ఒకప్పుడు పెద్ద పట్టణం అనడానికి  కొన్ని ఆధారాలు వున్నవి, ఊరు బయట బొడ్రాయి, హనుమాన్ బొoదలు, మల్లన్న గుడి,పెరుమాళ్ళ బావి ఇ వి పడమర. చేరవు, దేవతల బావి ఉత్తరాన. శివాలయం, శివుని గుడి, ముత్యాలమ్మ గుడి తూర్పున. పాటి గడ్డ, భీరప్ప గుడి  దక్షణాన ఉన్నవి.                                                  

మన ఊరు కాకాతియుల ఏలు బడిలో ని గ్రామం, ప్రస్తుతం అంజానేయ స్వామి గుడి ముందు వున్నా శిలాశాసనము మీద వున్నా లిఫి కాకతీయుల కాలమునాటిది అని నేను భావిస్తున్నాను, దానిపై వున్నా వ్రాతను పూర్తిగా చదివి౦చవలెను. ఇ౦తకుము౦దు మన బొడ్రాయి హనుమంత బొందలో ఉండేది అ౦టే వూరి మద్యలో వు౦డేదని అర్దము, మన వూరు చాల పెద్దది అని, అలాగే బిర్ల అంజయ్య ఇ౦టికీ దక్షిణన వీరులు అనే విగ్రహాం వుంది, అది కాకతియ రుద్రమదేవి విగ్రహాంగా నేను భావిస్తున్నాను, జేతల భావి ని దేవతల భావిగా నేను భావిస్తున్నాను, కాలని దగ్గర వున్నా బూరు బో౦ద-వూరు బొందలుగా, పాటి గడ్డ-పాడి గడ్డ గా, ఇ౦కొక విషయ౦ ల౦బాడి గుండు పై కూడ వ్రాత వు౦ది.పై విషాయాలను భట్టి పెద్దకొ౦దూకు ఒక చరిత్ర వు౦దని తేలుస్తుంది. పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం: కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, డా.మండల స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయం ప్రాంగణంలో కొత్త కాకతీయ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం గుర్తించడంలో కొండూరు గ్రామసర్పంచ్  కాయితి రమేష్ గౌడ్, ఎంపిటీసి బద్దం కొండల్ రెడ్డి,  ఆలయ కమిటీ చైర్మన్ జక్కిడి కొండల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గుండెబోయిన ఇస్తారి యాదవ్, ఉపాధ్యాయుడు పాలకూర వెంకటేశ్ గౌడ్ సహకరించారు.

శాసనలిపి, భాష తెలుగు. లిపి ఆధారంగా ఈ శాసనం 13,14వ శతాబ్దాలకు చెందింది. ఈ శాసనం  (పేర్కొన్న శక సం. భాగం విరిగిపోయివుంది) విరోధికృత్ శ్రావణ శుద్ద ద్వాదశి బుధవారంనాడు వేయబడ్డది. ప్రతాపరుద్రుని పాలనాకాలం ఆధారంగా ఇండియన్ ఎఫిమెరిస్ ప్రకారం శాసనం తేది 1311 జూలై 28 బుధవారం అవుతున్నది. కాకతీయ ప్రతాపరుద్రదేవుని పాలనాకాలంలో అతని లెంక మాదయగారి (భార్య) మల్లు బాలమ్మ పెదకొండూరులో వరదరాజస్వామి తిరుప్రతిష్ట చేసి, చేసిన దాన వివరాలు ఈ శాసనంలో పేర్కొనబడ్డాయి. మల్లు బాలమ్మ, మాదయ లెంక గారలు పెదకొండూరు వరదరాజస్వామి  అంగరంగభోగాలకు, అముడుపడి(ఆహార నైవేద్యం)కి ధారాపూర్వకంగా కొండూరి చెరువు దగ్గర ఇరుకార్తెలు పండే జలచేను(నీర్నేల, తరిభూమి)ను, క్రయలబ్ధం చేసిన(కొన్న) భూములను, ఇంతవరకు సర్వమాన్యంగా పెక్కండ్రు(వస్తుమార్పిడి వ్యాపారసంస్థ) ఇచ్చిన ఆదాయం, 20 పొంకలు (పొనికెలు, ఎడ్లబండ్లల్లో వేసే గూడు వంటిది) పత్తి కొన్నవారు మాడలెక్కన, తమలపాకుల మోపు కొన్నవారు, ధాన్యాల అమ్మకం చేసినవారు మాడ, మానెడు ధాన్యం, అష్టాదశప్రజలు, మహాజనాలు గుడిలో రంగభోగానికి తమ వ్రిత్తుల(పారంపర్య దాన మాన్యాలు)నుంచి 1మర్తురు(1న్నర ఎకరం) తరిపొలము, చిన్నము(చిన్నబంగారునాణెం), మెట్టపొలమున్నవారు 1పుట్టి ధాన్యం, చిన్నము నాణెం, పెరికలు, కోమట్లు, అద్దుగులు, సానెవారు, కరణాలు, తలారులు, బంట్లు మాడలు ఇవ్వాలని శాసనం శాసించింది.

ఈ శాసనం కాకతీయులనాటి సామాజిక, ఆర్థిక సంస్థలను వివరించింది. గ్రామం గుడినిర్మాణం చేసినపుడు ఊరుమ్మడిగా తమ ఆదాయాల నుంచి దేవాలయ నిర్వహణకు తమ వంతుగా ఇవ్వాల్సిన పన్నులను పేర్కొన్నది శాసనం. ఈ శాసనంలో కాకతీయపాలకులు రుద్రదేవుడు, అతని తమ్ముడు మహదేవుడు, తనకూతురు రుద్రమదేవి, ఆమె కూతురుకొడుకు ప్రతాపరుద్రుని వరకు పేర్కొన్నప్పటికి వంశనామం ‘కాకతీయ’ పేర్కొనలేదు. ఇది మా చరిత్రబృందానికి  కొత్తగా లభించిన కొత్త కాకతీయ శాసనం.
పెదకొండూరులో శాసనాలున్న రెండు వీరగల్లులు, రెండు ఆత్మాహుతి వీరగల్లులు, ఒక సతిశిల వీరగల్లులను సభ్యులు గుర్తించారు. పెదకొండూరులోని వరదరాజస్వామి దేవాలయం ఏకకూటాలయం. గర్భగుడి, అంతరాళం, అర్థమంటపం, ముఖ మంటపాలతో, ఇటుకలతో కట్టిన విమానంతో ఉండేది. ఆ గుడి పునఃనిర్మాణం కొరకు విప్పిపెట్టారు. అక్కడి ప్రాచీన శివాలయంలో కాకతీయశైలి లింగవేది, శివలింగం ఉన్నాయి. ద్వారబంధాలకు రెండువైపుల కలశాలున్నాయి. గుడి ద్వారానికి లలాటబింబంగా మూలాధారబంధనాసనంతో గజలక్ష్మి శిల్పం ఉంది. చాళుక్యశైలిలో ఒక సప్తమాతృకాఫలకం ఆ ప్రాంగణంలో ఉంది. చాళుక్యపూర్వశైలిలో చెక్కిన మహిషాసురమర్దిని శిల్పం ప్రత్యేకమైనది. సభ్యులు పెదకొండూరు పాటిగడ్డమీద సాతవాహనులకాలంనాటి ఎరుపుపూత కుండపెంకులు సేకరించారు. లభించిన పురావస్తు, శిల్ప, దేవాలయాల ఆధారంగా పెదకొండూరు సాతవాహనుల నుంచి కాకతీయుల దాక చారిత్రకంగా విలసిల్లిన గ్రామమనిపిస్తుంది.


written by guest

Peddakondur Home About Peddakondur & History

How to reach Peddakondur

Tourist Places Near By Peddakondur

Schools in Peddakondur

Colleges in Peddakondur

Temperature & weather of Peddakondur

places in Peddakondur


Peddakondur photos

More Information

Village Talk
Post News or Events about this Village







All Rights Reserved 2021 onefivenine.com             Contact Us             About Us /             Privacy Policy